Minister Nara Lokesh: రాజధాని అమరావతిలోని విట్ ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉన్నత విద్య ఫెయిర్ ను ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.. అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రధానంగా జీవితానికి ఉపయోగపడే విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు.. నేను ఇన్విజిలేటర్ లేని పరీక్ష హాళ్లను చూశానని గుర్తుచేసుకున్న ఆయన.. ప్రతీ అంతర్జాతీయ సంస్ధలోనూ భారతీయులు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు.. విద్యార్ధులు భవిష్యత్తు గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు.. విద్యార్ధులు తమ చుట్టూ, అలాగే అంతర్జాతీయంగా ఏం జరుగుతోందో అప్‌డేట్‌లో ఉండాలన్నారు.. నాకు ఎప్పుడైనా వెనక్కి తగ్గాను అనిపిస్తే నేను చదువుకున్న రోజుల్లో విషయాలు గుర్తు తెచ్చుకుంటాను అని తెలిపారు.
Read Also: Supreme Court: ఉద్యోగ నియామకాల సమయం మధ్యలో రూల్స్ మార్చడానికి వీల్లేదు..
ఇక, రాజధాని అమరావతిని గత ఐదేళ్లలో పూర్తిగా వదిలేశారని విమర్శించారు మంత్రి లోకేష్.. మేం అమరావతిని ఒక బెంచ్ మార్క్ గా మారుస్తాం అన్నారు.. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.. కాగా, ఈ మధ్యే.. అమెరికాలో పర్యటించిన లోకేష్.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు.. మౌలికసదుపాయాలు తదితర అంశాలపై ప్రముఖ కంపెనీల సీఈవోలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించిన విషయం విదితమే.