Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సినీ నటి జత్వానీ.. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రికి వివరించాను. పోలీసులు నా విషయంలో.. నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది.
Read Also: IND vs BAN: పెవిలియన్‌కు భారత బ్యాటర్లు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ యువ పేసర్!
నాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు సినీనటి జత్వానీ.. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోంది. నాపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదు.. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరాను. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నాం అని పేర్కొన్నారు సినీ నటి జత్వానీ.
Read Also: Daggubati Purandeswari: జెమిలి ఎన్నికలు.. మంచి ఆశయంతో ఉన్నాం..
ఇక, సినీనటి జత్వానీ లాయర్ మాట్లాడుతూ.. జత్వానీ వ్యవహారంలో పెద్దలు ఎవరు ఉన్నారో బయటకు వచ్చింది. ఈ కేసు రూట్ కాజ్ ఏంటో అందరికీ తెలుసు.. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానీపై ఏపీలో కేసు పెట్టారు. ఏపీలో జత్వానీపై ఉన్న కేసు క్లోజ్ అయితే.. ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతాం అన్నారు. జత్వానీ మీద కొందరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఐపీఎస్‌లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. జత్వానీ మీద కేసును విత్ డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుంది. చట్టం అందర్నీ సమానంగానే చూడాలి. కుట్రకు మూలం ఎవరు..? తెర వెనుక పెద్దలు ఎవరనేది విచారణలో తేలుతుంది. జత్వానీ ఫోన్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఫోన్ ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారో కూడా మెసేజ్ కూడా వచ్చింది. జత్వానీని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా చెప్పారా..? కాపీలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు జత్వానీ లాయర్.