Site icon NTV Telugu

Kolikapudi vs Kesineni Chinni: రేపు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు కొలికపూడి, కేశినేని.. ఏం జరగబోతోంది..?

Kolikapudi Vs Kesineni Chin

Kolikapudi Vs Kesineni Chin

Kolikapudi vs Kesineni Chinni: టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు.. అయితే, తాజాగా, పార్టీలో కొందరు నేతల వ్యవహారం టీడీపీకి ఇబ్బందికి కరంగా మారింది.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం.. టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కు ఇబ్బందిగా మారింది.. అసలు వీళ్లకి టికెట్లు ఎందుకు ఇచ్చాను దేవుడా అనే పరిస్థితి వరకు వచ్చింది.. గత కొన్ని నెలలుగా కొలికపూడి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో తిరువూరు లో స్థానిక నేతలతో వివాదం.. ఒక మహిళ ఆత్మహత్యాయత్నం.. ఇవన్నీ వివాదంగా మారాయి.. గతంలో మూడు సార్లు క్రమ శిక్షణా సంఘం ముందు హాజరయ్యారు ..

Read Also: Minister Nara Lokesh: గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు ఎలా సాధ్యం..? ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు..!

ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై ఫైర్ అయ్యారు కొలికపూడి.. ఇసుక.. లిక్కర్ మాఫీయాను చిన్ని పెంచి పోషిస్తూన్నారన్నారు.. పార్టీ పదవులు చిన్ని అమ్ముకున్నారన్నారు. తనకు టికెట్ ఇవ్వడానికి చిన్నికి డబ్బులు ఇచ్చా అన్నారు కొలికపూడి… ఈ అంశం పై చిన్ని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.. టికెట్ల కోసం డబ్బులు తీసుకునే నైజం తనది కాదన్నారు.. కానీ, టోటల్ ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు… యువకులు కదా అని టికెట్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాలని చెప్పారు.. దీంతో రేపు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి… ఎంపీ కేశినేని చిన్ని హాజరు అవుతున్నారు..

Read Also: CM Chandrababu in London: లండన్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు..

రేపు ఉదయం 11 గంటలకు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌.. సాయంత్రం 4 గంటలకు కేశినేని చిన్ని హాజరవుతున్నారు.. వర్ల రామయ్య అధ్యక్షతన టీడీపీ క్రమశిక్షణా సంఘం విచారణ చేయనుంది.. పంచమర్ధి అనురాధ.. కొనకళ్ల నారాయణ.. షరీఫ్.. రామరాజు.. సభ్యులు గా ఉన్నారు.. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా రేపు ఉండనున్నారు.. మంత్రి నారా లోకేష్ రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అవసరం అయితే లోకేష్ కూడా వీరిద్దరితో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు, తిరువూరు ఎపిసోడ్ ముగిసిన తర్వాత మరి కొంతమందితో కూడా క్రమ శిక్షణా సంఘం మాట్లాడే అవకాశం ఉంది.. ఎమ్మెల్యే ఎంపీల మధ్య విభేదాలు.. కొంతమంది ఎమ్మెల్యేల వైఖరితో సీఎం చంద్రబాబు అసహనంతో ఉన్నారు.. దీంతో మరి కొందర్ని పిలిచే అవకాశం ఉంది.. చంద్రబాబు మాత్రం అవసరం అయితే చర్యలు తీసుకోడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదన్నారు.. మరి క్రమశిక్షణా సంఘం సమావేశం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి.

Exit mobile version