Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ క్రీడా యాప్ లాంచ్.. ఇక, వారికి చెక్‌..!

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Andhra Pradesh: రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేశామన్నారు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి.. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ క్రీడా యాప్ లాంచ్ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. శాప్ ఎండీ గిరీష్ కుమార్.. నూతన ప్రభుత్వం ద్వారా క్రీడలలో ప్రాధాన్యత పెరిగిందని.. దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారని.. దేశంలో అధిక మొత్తంలో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామని తెలిపారు.. క్రీడా రంగంలో పారదర్శకంగా సేవలను అందించేందుకు క్రీడా యాప్ ఆవిష్కరిస్తున్నాం.. క్రీడాకారులకు వెన్నుదన్నుగా అన్ని డిజిటల్ సేవలు అందనున్నాయన్నారు శాప్ ఎండీ గిరీష్ కుమార్..

Read Also: Deputy CM Pawan Kalyan: రేపు సాలూరుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఇక, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం.. రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేశామన్నారు రాంప్రసాద్‌రెడ్డి.. రాష్ట్రంలో ప్రోత్సాహకాల విషయంలోను, ఉద్యోగ అవకాశాల విషయంలోను అన్ని అంశాలు క్రీడా విధానంలో ప్రవేశ పెట్టడం జరిగింది.. అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ క్రీడా పోటీలు జరిపించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో హయంలో రాష్ట్రంలో క్రీడా శాఖ అనేది లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో క్రీడాకారులు, అసోసియేషన్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ద్వారా క్రీడా రంగంలో ఉన్న అందరికీ ఐదు సంవత్సరాలు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే క్రీడా పాలసీ, క్రీడా యాప్ తీసుకొని రావడం జరిగింది.. విద్య, క్రీడా శాఖల అనుసంధానంతో గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు నేషనల్ గేమ్స్ ఆడే వారికి మంచి రోజులు వస్తాయని తెలిపారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి..

Read Also: Bird Flu: మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ గుర్తింపు..

శాప్ ఛైర్మన్ రావినాయుడు మాట్లాడుతూ.. క్రీడా విధానంలో ఇది చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.. క్రీడలను అడ్డు పెట్టుకొని అర్హులు కాకుండా అనర్హులు ఉద్యోగాలు పొందుకున్నారు. అర్హులకు న్యాయం చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో క్రీడ యాప్ తీసుకువచ్చాం అన్నారు.. క్రీడా రంగంలో సమర్ధవంతమైన పాలనకు క్రీడా యాప్ నాంది పలకనుంది. క్రీడా కారులు, క్రీడా సంఘాలు, శిక్షకులు అందరు విరివిగా యాప్ ఉపయోగించి ప్రజలకు చేరువచేయాలి. గత ప్రభుత్వం క్రీడాలను ప్రచార సాధనంగా మలచుకుంది. కూటమి ప్రభుత్వం ద్వారా క్రీడలకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు శాప్ ఛైర్మన్ రావినాయుడు.

Exit mobile version