Site icon NTV Telugu

Minister Nimmala Ramanaidu: 1,040 లిఫ్ట్‌ స్కీమ్‌ల్లో 450 మూత‌.. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం..

Minister Nimmala Ramanaidu

Minister Nimmala Ramanaidu

Minister Nimmala Ramanaidu: లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ‌, మోటార్ల మ‌ర‌మ్మత్తుల‌కు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్‌ జ‌గ‌న్ ఎత్తిపోత‌ పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్‌ స్కీమ్‌లకు గాను 450 లిఫ్ట్‌ స్కీమ్‌లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.. వార్షిక పద్ధతిలో తాళ్తూరు లిఫ్ట్ పై చర్యలు ఉంటాయన్నారు.. లిఫ్ట్ లు మొత్తం జీరో మెయింటెనెన్స్‌.. లిఫ్ట్‌ స్కీమ్ ల నిర్వహణ‌, మోటార్ల మ‌ర‌మ్మత్తుల‌కు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా.. జ‌గ‌న్ ఎత్తిపోత‌ల‌ను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గ‌త పాల‌న కారణంగా లిప్ట్ స్కీమ్‌లు ప‌ని చేయకపోవడంతో 4 ల‌క్షల ఎక‌రాలు బీడుగా మారిపోయానని విమర్శించారు.. తాళ్లూరు లిఫ్ట్‌ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయన్నారు.. తాళ్లూరు లిఫ్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నాం అని శాసన సభలో వెల్లడించారు ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఇక, సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారో తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version