Site icon NTV Telugu

Minister Narayana: రేపే ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’.. అధికారులకు మంత్రి దిశా నిర్దేశం

Minister Narayana

Minister Narayana

Minister Narayana: రేపు ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమం నిర్వహణకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి నారాయణ.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. రేపు ఇ – చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు..

Read Also: Jeedimetla: పిల్లలను చంపి తల్లి ఆత్యహత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

ఇక, షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలి.. మున్సిపాలిటీల్లో ఉన్న RRR సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలని స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలి… దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాలలోనూ స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ..

Exit mobile version