Site icon NTV Telugu

Minister Narayana: మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్.. మంత్రి నారాయణ సమీక్ష

Narayana

Narayana

Minister Narayana: ఎండలు దంచికొడుతున్నాయి.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో, సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ పై ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మంత్రి నారాయణ దృష్టిసారించారు.. తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ.. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు.. తాగు నీరు సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.. వారంలో మూడు సార్లు డ్రింకింగ్ వాటర్ సరఫరాపై సమీక్ష చేస్తానని వెల్లడించారు మంత్రి నారాయణ.. శివారు ప్రాంతాలకు కూడా అవసరమైన మేర డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. పారిశుధ్యం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ..

Read Also: Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Exit mobile version