AP Assembly Session: అసెంబ్లీలో మున్సిపల్ శాఖకు సంబంధించిన 5 బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రి పొంగూరు నారాయణ.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలు సవరణ-1, సవరణ-2, సవరణ-3, సవరణ-4 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టారు.. ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీల చట్టం సవరణ బిల్లు 2025ను కూడా సభలో ప్రవేశపెట్టారు మంత్రి నారాయణ.. ఇక, మొత్తం ఐదు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది..
Read Also: Mohan Babu : ప్యారడైజ్ సెట్‌లో మోహన్‌బాబు ఎంట్రీ!
ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందిన బిల్లుల వివరాలు..
1. నాలా చట్టం రద్దుతో మున్సిపాల్టీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలకు సంబంధించి చట్ట సవరణకు ఆమోదం.
2. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం.
3. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేలా చట్ట సవరణకు ఆమోదం.
4. ఏపీలో పట్టణ, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 గా మారుస్తూ చట్ట సవరణ బిల్లు.. ఆమోదం.
5. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరును తాడిగడప మున్సిపాల్టీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం….
