AP Legislative Council: శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో, మండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ విపక్షనేత బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు పెంపొందాలి అన్నారు.. ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు సలహాదారుగా పెట్టుకున్నాం.. ఆయన రాసిన పుస్తకాలు ముద్రించి విద్యార్ధులకు అందిస్తున్నాం.. ఆయన ఒక్క రూపాయి జీతం, ఇతర సౌకర్యాలు ఏమీ తీసుకోకుండా పనిచేస్తున్నారు అని వెల్లడించారు.. ఎస్సీ, బీసీ విద్యార్ధులకు విడిగా క్లాసులు పెట్టామన్న సమాచారం ఉంటే ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి లోకేష్..
Read Also: OG : పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
అయితే, సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలకు పొంతన లేదు అని విమర్శించారు విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రశ్న అడిగాం.. ఫీజుల నియంత్రణ కోసం కమిటీ వేస్తున్నామా? లేదా? అని అడిగాం.. ఆర్టీఈ యాక్ట్ గురించి తీసుకున్న చర్యలేంటి అని ప్రశ్నించారు బొత్స.. అయితే, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పా.. ప్రభుత్వం 50 వేల మంది పిల్లలకు ఆర్టీఈ ప్రకారం విద్యను అందించాం అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి..
