Minister Nara Lokesh Australia Tour: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ వచ్చిన ఆయన.. కీలక పెట్టుబడులను సైతం సాధించగలిగారు.. ఇక తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు నారా లోకేష్.. రేపటి నుంచి అంటే.. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సిందిగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఏపీ మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం పంపించారు.. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా గవర్నమెంట్.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాల్సిందిగా నారా లోకేష్‌కి పంపిన ఆహ్వానంలో పేర్కొంది..
Read Also: Railways: కదులుతున్న రైలు డోర్ దగ్గర కొబ్బరి కాయ కొట్టిన ఉద్యోగి.. చర్యలు తీసుకోవాలన్న ప్రయాణీకులు
దీంతో, రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించి.. వివిధ యూనివర్సిటీలను సందర్శించనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి.. ఆయా యూనివర్సిటీల్లో అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేయనున్నారు.. మరోవైపు, వచ్చే నె అంటే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోలో పాల్గొననున్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో కీలక మార్పులు చేసిన మంత్రి నారా లోకేష్.. ఈ పర్యటన తర్వాత మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
