NTV Telugu Site icon

Minister Nara Lokesh: దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది…

Lokesh

Lokesh

Minister Nara Lokesh: దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగరవేసి.. పోలీసుల గౌరవందనం స్వీకరించారు.. ఆ తర్వాత మాట్లాడుతూ.. మాకు వద్దు తెల్ల దొర తనం, అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.. దేశ స్వాతంత్రం కోసం, తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి.. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో ఏడుగురు ప్రాణ త్యాగం చేశారు అని గుర్తుచేశారు.. ఇక, స్వాతంత్ర కోసం పోరాడిన పోరాడినయోధులకు నివాళులర్పిస్తున్నానన్న లోకేష్.. దేశమంటే భక్తి ఉండాలి.. ఉపాధ్యాయులు పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండాలని సూచించారు.

Read Also: Mahindra Thar Roxx SUV: మహీంద్రా థార్‌ రాక్స్ వచ్చేసింది.. ధర రూ.12.99 లక్షలు, మైమరిపించే ఫీచర్లు!

ఈరోజు నేను పాల్గొంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ,నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అన్నారు మంత్రి లోకేష్‌.. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్య్ర పోరాటాన్ని ఏపీ ప్రజలు స్ఫూర్తిగా తీసుకున్నారు.. మొన్న గడిచిన ఎన్నికల్లో అదే శాంతి, అహింస పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి .. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పుడు ప్రతి రాష్ట్ర పౌరుడి కంటిలో ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం ఉండదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌..