NTV Telugu Site icon

Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఇంకా రెడ్‌ బుక్‌ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేష్ కు వినతులు వెల్లువెత్తాయి.. లోకేష్ ని కలిశారు పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు.. తమ తమ బయోడేటాలు లోకేష్ కు అందజేశారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హాట్‌ కామెంట్లు చేశారు లోకేష్‌.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి.

Read Also: Poisonous Snakes: ఏటా ఘనంగా పాముల జాతర..విషసర్పాలను నోటిలో కరచుకుని ఊరేగింపు

పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తుచేసిన మంత్రి లోకేష్‌.. రెడ్ బుక్ కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడు అని దుయ్యబట్టారు.. గత 5ఏళ్ల కాలంలో జగన్ రెండు ప్రెస్‌మీట్లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్‌మీట్లు పెట్టాడు అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా? అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, వైఎస్‌ జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరు అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌.