Minister Nara Lokesh: సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన తగిన సాయం అందించడంలో ముందు ఉంటారు మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విదేశాల్లో చితికిపోతున్న ఎంతో మందిని స్వదేశానికి రప్పించిన ఘనత ఆయన.. తాజాగా, పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు మంత్రి లోకేష్…
Read Also: Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. లక్ష కోట్లతో ఆర్‌డీఐ స్కీమ్‌కు గ్రీన్సిగ్నల్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో.. ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది. దీంతో వైద్యఖర్చులకు గాను రూ.10 లక్షల వరకు ఎల్ వోసీ మంజూరుచేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధికమొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. దీంతో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచే ఏర్పాటు చేసారు లోకేష్.. ఒక్కరోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
