AP SSC Exams 2025 Schedule: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ (ఎక్స్)లో టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. 2025 మార్చి 17వ తేదీ నుంచి 31 తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.. SSC విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్! మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. మీరు మెరుగ్గా ప్రిపేర్ అవ్వడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మేం ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేశాము.. ఈ అదనపు సమయాన్ని చదువుకోవడానికి మరియు అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి! అని సూచిస్తూ.. నా సోదరులు మరియు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.. తెలిపారు మంత్రి నారా లోకేష్..
Read Also: Low Fertility Rate: వారానికి 4 రోజులే పని..సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ కీలక నిర్ణయం..
ఇక, ఏపీలో 2025 మార్చి 17 నుంచి 31 తేదీ వరకు నిర్వహించనున్న టెన్త్ పరీక్ష షెడ్యూల్.. ఏ రోజు.. ఏ పరీక్ష నిర్వహిస్తారనే వివరాల్లోకి వెళ్తే..
* మార్చి 17 తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష
* మార్చి 19 తేదీన రెండో లాంగ్వేజి పరీక్ష
* మార్చి 21 తేదీన ఇంగ్లీష్ పరీక్ష
* మార్చి 24 తేదీన గణితం పరీక్ష
* మార్చి 26 తేదీన భౌతిక శాస్త్రం పరీక్ష
* మార్చి 28 తేదీన బయాలజీ పరీక్ష
* మార్చి 29 తేదీన ఓకేషనల్ పరీక్ష
* మార్చి 31 తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష
https://x.com/naralokesh/status/1866833029089595556?t=fC9GT953JTPBA0VEfaZA9A&s=08