Site icon NTV Telugu

Minister Nara Lokesh: మనమంతా టీడీపీ కుటుంబ సభ్యులం.. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం.. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడారని అభినందించారు.. నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్.. శేషగిరిరావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం అన్నారు.. ఇక, కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు మంత్రి లోకేష్..

Read Also: BRS Protest: ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి వినతి.. ప్రైవేట్ పరం చేయొద్దని కేటీఆర్, హరీష్‌రావు సూచన..

ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు లోకేష్.. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్నారు శేషగిరిరావు.. అయితే, రెండు నెలల క్రితం ఆయన గుండె పోటుతో మృతి చెందారు.. దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత వారి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version