NTV Telugu Site icon

AP Inter Results: రేపే ఇంటర్‌ ఫలితాలు.. ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..!

Ap Inter Results

Ap Inter Results

AP Inter Results: ఇంటర్‌ ఫలితాలు విడుదలకు టైం వచ్చేసింది.. రేపు అనగా ఏప్రిల్‌ 12వ తేదీన ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండిర్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు లోకేష్‌.. ఇక, ఏపీ ప్రభుత్వం వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఎన్నో సేవలను అందిస్తోన్న విషయం విదితమే కాగా.. వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా ఇంటర్ ఫలితాలు పొందే అవకాశం ఉందని తెలిపారు మంత్రి లోకేష్‌.. 95523 00009 నెంబర్ కు Hi.. అని మెసేజ్‌ పెడితే ఇంటర్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు.. మరోవైపు APResults.bie.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. resultsbie.ap.gov.in సైట్‌లో, మన మిత్ర యాప్‌లో కూడా ఇంటర్‌ ఫలితాలు పొందవచ్చు..