Site icon NTV Telugu

Minister Nadendla Manohar: కొత్త రేషన్‌ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్‌ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఈ కేవైసీ నమోదు పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెడతాం అన్నారు.. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తాం అన్నారు మంత్రి మనోహర్.. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కార్డ్‌లో ఉంటాయన్నారు.. రేషన్ కార్డు అని కాకుండా ఫ్యామిలి కార్డుగా ఉంటుందన్నారు.. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్‌గా రేషన్‌ కార్డు ఉంటుందని వెల్లడించారు..

Read Also: Kakani Govardhan Reddy: కాకాణి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..!

ఇక, ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు ఎప్పుడు లేని విధంగా కొనుగోలు చేశామన్నారు మనోహర్‌.. రైతుకు భరోసా కల్పించేలా 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ అయింది. రైతులకు ఏ మిల్లు కు కావాలంటే ఆ మిల్లుకు ధాన్యం అమ్ముకునే అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వం కన్నా 20 శాతం అధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాలో 65 వేల మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం.. వెహికల్స్ సీజ్ చెయ్యమని కూడా చెప్పాం… గతంలో ఎప్పుడు లేని విధంగా సీజ్ చేశామని.. మిల్లర్ అసోసియేషన్ తో కూడా సమావేశాలు పెట్టామన్నారు.. కాకినాడలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం.. ఎప్పటికప్పుడు చెకింగ్ జరుగుతోందని.. దీపం 2 పథకం గత దీపావళి రోజు ప్రారంభం అయ్యింది.. దీపం పథకాన్ని మొదటి దశలో 99 లక్షలకు పైగా వినియోగించుకున్నారు.. ఇవాళ్టి నుంచి దీపం పథకం రెండో విడత ప్రారంభం అవుతుందన్నారు.. ఈ కేవైసీ నమోదు తప్పనిసరి.. క్యూలో నిలుచునే అవసరం లేకుండా ఈ పాస్ నుంచి కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు.. కోటి మందికి పైగా దీపం పథకం లబ్ధిదారులు అవుతారని భావిస్తున్నాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. స్కూళ్లు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

Exit mobile version