Site icon NTV Telugu

Minister Nara Lokesh: ఇక, మేనేజ్‌మెంట్‌ కమిటీలకు స్కూళ్ల పనులు.. మంత్రి లోకేష్‌ కీలక ఆదేశాలు..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్‌ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించి త్వరిగతిన పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైబడి విద్యార్థులున్న పాఠశాలలు 60 ఉన్నాయని.. ఆ స్కూళ్లలో 5స్టార్ సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలన్నారు మంత్రి లోకేష్.. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో సీట్ల కోసం పోటీ ఉందని.. ఇది మంచి పరిణామం అన్నారు లోకేష్.. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, తాగునీరు, టాయ్‌లెట్లు, పెయింట్స్, బల్లల ఏర్పాటు వంటి పనులను ఎస్ఎంసీలకు అప్పగించాలని… మోడల్ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.143.27 కోట్లు అవసరం అన్నారు… ఈ పనులను మాత్రం రాష్ట్ర పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టండి.

Read Also: Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన

ఈ ఏడాది మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.571.11 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. వివిధ విభాగాల ద్వారా నిధులను సేకరించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయండి. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో సొంత భవనాలు లేని పాఠశాలలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇక, ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఎన్‌రోల్‌మెంట్ పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌ నిర్వహించండి.. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తాం అన్నారు.. ఈసారి 10 శాతం అడ్మిషన్ల పెంపుదల లక్ష్యంగా పనిచేయండి. పాఠశాలల్లో డ్రాపవుట్స్ ను జీరో స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version