Site icon NTV Telugu

Minister Kollu Ravindra: లిక్కర్‌ స్కాంపై ఎక్సైజ్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు..

Kollu

Kollu

Minister Kollu Ravindra: లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు.. లిక్కర్ స్కామ్ అతి పెద్ద స్కామ్ అని మొదటినుంచి మేం చెబుతున్నాం.. వైసీపీ నుంచి బయటకు వచ్చి మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ లావు పార్లమెంట్ లో చెప్పారు.. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారని తెలిపారు.. విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో వైఎస్‌ జగన్ ఏజెంట్ గా ఉన్నాడని చెప్పారన్న ఆయన.. వాళ్ల నాయకులే ఇదంతా చెబుతున్నారు.. లిక్కర్ లో ప్రతి దశలో స్కామ్ జరిగిందని ఆరోపించారు..

Read Also: Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. నిజమెంత..?

రాష్ట్రం ఈ స్కామ్ వల్ల వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు మంత్రి కొల్లు.. దీనివల్ల పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయన్న ఆయన.. 99 వేల కోట్లు నగదు లావాదేవీలు జరిగాయి.. లిక్కర్ స్కామ్ పై సీఐడీ, సిట్ విచారణ జరుగుతోందన్నారు.. మరోవైపు, బియ్యం కేసు ఇంకా విచారణ దశలో ఉందని పేర్ని నాని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.. ముందస్తు బెయిల్ వచ్చిందని ఏది పడితే అది వాగితే పేర్ని నానికి బాగోదని వార్నింగ్‌ ఇచ్చారు.. నాసిరకం బ్రాండ్స్ వల్ల అనేక మంది చనిపోయారు.. సరైన సమయంలో అందరూ అరెస్ట్ అవ్వక తప్పదని పేర్కొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.. కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కూడా లిక్కర్‌ స్కామ్‌పై చర్చించిన విషయం విదితమే..

Exit mobile version