Minister Atchannaidu: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.. రాయితీపై బిందు సేద్యం అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యానికి అవసరమైన ఎక్విప్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని పేర్కొన్న ఆయన.. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు.. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిందు సేద్యం నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు.. దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని ఆరోపించారు.. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర కక్ష పూరిత ధోరణి అవలంభించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో.. చంద్రబాబు కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు.. వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. గత ప్రభుత్వ హయాంలో.. అవకతవకలు, అవినీతి జరిగిందంటూ తీవ్రస్థాయిలో మండిపడుతోన్న విషయం విదితమే.
Read Also: Honor Magic 6 Pro: మరో కొత్త ఫోన్ విడుదల చేసిన హానర్..ఫోన్లోనే ఫొటోగ్రఫీ!