Site icon NTV Telugu

Medical College Tenders: హాట్‌ టాపిక్‌ గానే మెడికల్‌ కాలేజీల వ్యవహారం.. టెండర్లు రాకపోవడానికి కారణం అదేనా..?

Medical College Tenders

Medical College Tenders

Medical College Tenders: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం. హాట్ టాపిక్ గా మారింది … ఏపీలో నాలుగు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి టెండర్లు పిలిచారు.. అయితే, కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే బిడ్ దాఖలు అయ్యింది.. అది కూడా ఆదోనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్ వేశారు.. మిగిలిన మూడు మెడికల్ కాలేజీలకు ఎలాంటి టెండర్ లు రాలేదు… మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ ప్రాంతాల్లో కనీసం ఒక్క టెండర్ కూడా నమోదు కాకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

Read Also: ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!

మరోవైపు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా తాము.. అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతామంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్‌ల వల్లే.. బెదిరింపుల కారణంగా… టెండర్లు ప్రక్రియ నిలిచిపోయిందని స్వయంగా మంత్రి సత్యకుమర్ చెబుతున్నారు. మెడికల్ కాలేజ్ టెండర్లు మూడు కాలేజీలకు రాకపోవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు.. జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే టెండర్లు రాలేదు అన్నారు.. వ్యక్తిగతంగా కూడా బెదిరింపులకు దిగారని అన్నారు.

ఇక్కడే…. అసలు చర్చ మొదలైంది.. ఒక ప్రతిపక్ష నాయకుడు అందులో 11 సీట్లు ఉన్న.. ప్రతిపక్ష నాయకుడు బెదిరిస్తే.. బెదిరిపోయి.. టెండర్లు రాకపోతే.. రేపు భవిష్యత్తులో పీపీపీ మోడల్ లో కట్టే మిగిలిన నిర్మాణాల పరిస్థితి ఏంటి అనే చర్చ ప్రారంభమైంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదీ పీపీపీ మోడల్ లో ప్రారంభించడానికి ముందుకెళ్తోంది.. రోడ్డు నిర్మాణం కావచ్చు.. ఇతర నిర్మాణాలు కావచ్చు.. మెడికల్ కాలేజీలు కావచ్చు.. ప్రతి అంశం మీద ప్రత్యేకంగా పీపీపీపై దృష్టి పెట్టింది.. ప్రస్తుతం ప్రభుత్వమే జగన్ బెదిరింపులు వల్ల మెడికల్ కాలేజీలకు టెండర్లు రాలేదని చెప్తే ఇక భవిష్యత్తులో మిగిలిన కట్టడాలు కానీ.. నిర్మాణాలు కానీ.. ఏ రకంగా చేస్తారు అనే చర్చ జరుగుతోంది..

కేవలం నాలుగే నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తేనే ఒక కాలేజీకి టెండర్ వచ్చి మిగిలిన మూడు కాలేజీలకు టెండర్లు రాకపోతే… భవిష్యత్తు పరిణామాలు ఏ రకంగా ఉంటాయనే.. చర్చ ప్రధానంగా జరుగుతోంది.. మంత్రి సత్య కుమార్ దీన్ని ధృవీకరించడం .. సీఎం చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని మాట్లాడటం ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. ప్రభుత్వం ఒకపక్క అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నా.. పీపీపీ మోడల్ లో.. కొన్ని నిర్మాణాలకు సంబంధించి ముందుకు వెళ్తోంది.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్… అని పీపీపీ మోడ్‌లో కట్టే మెడికల్ కాలేజీలపై విమర్శలు చేస్తూ ఉన్నారు… అన్ని స్కామ్ లకు.. ఇదే మూలం అని… అధికారంలోకి వస్తే జైల్లో పెడతాను అని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు.. ఇదే పరిస్థితి కొనసాగితే… మరి భవిష్యత్తులో ఇవే పరిణామాలు కొనసాగుతాయా..? ప్రభుత్వం ఏమైనా.. చర్యలు తీస్కుంటుందా…? అనేది చూడాలి.. కూటమి నేతల్లో మాత్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

Exit mobile version