Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..
Read Also: Ponnam Prabhakar: అప్పుడు ఆర్టీసీ ఉంటుందా అనుకునే పరిస్థితి.. ఇప్పుడు లాభాల్లో నడుస్తోంది!
ఇక, అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో.. దాని ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పల్నాడు, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. మరోవైపు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.. అయితే, రేపు అనగా గురువారం రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ కాగా.. అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.. ఇక, సముద్రం అలజడిగా మారడంతో ఈ సమయంలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు..
