Site icon NTV Telugu

Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయండి.. లోకేష్ ఆహ్వానం

Nara Lokesh Meets Fairfax C

Nara Lokesh Meets Fairfax C

Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సా‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ, ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా హోటల్ మరియు టూరిజం రంగాల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీ మాదిరిగా, ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల ప్రాంతంలో స్టెర్లింగ్ రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలి అని సూచించారు. టొరంటో కేంద్రంగా పని చేస్తున్న తమ సంస్థ నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రేమ్ వాత్సా తెలిపారు. భారత్‌లో బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, సన్మార్ కెమికల్స్‌లో తమ పెట్టుబడులు ఉన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రేమ్ వాత్సా హామీ ఇచ్చారు.

Read Also: Local Body Elections : మూడో విడతలో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

Exit mobile version