NTV Telugu Site icon

Liquor shops: మందుబాబులకు గుడ్‌ న్యూస్‌.. యథావిధిగా లిక్కర్‌ షాపులు.. నో బంద్..

Liquor Shops

Liquor Shops

Liquor shops: ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులకు గుడ్‌ న్యూస్‌.. గత కొంత కాలంగా మద్యం షాపులు బంద్‌ కానున్నాయంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.. అయితే, రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బంద్ ని నిరవధికంగా వాయిదా వేసింది ఏపీ బేవరేజ్ కార్పొరేషన్‌ సేల్స్ మెన్స్ అండ్‌ సూపర్వైజర్ల అసోసియేషన్.. బంద్‌ని వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించారు ఆ సంఘ ప్రతినిధులు.. అయితే, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు కమిషనర్ నిశాంత్ కుమార్.. దీంతో.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, యథావిధిగానే మద్యం షాపులు పని చేస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కమిషనర్ నిశాంత్ కుమార్..

Read Also: CM Revanth Reddy: తక్షణ సాయం అందించాలి.. కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి

కాగా, మొదట ఈ నెల 7వ తేదీ నుంచి మద్యం షాపులు బంద్‌ చేయాలని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌‌తోనే ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్వ్యూల ద్వారా తమను ఎంపిక చేశారు.. ఇప్పుడు తాము ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.. ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం స్పందించే వరకు ఈ బంద్‌ కొనసాగిస్తామని పేర్కొన్నారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బంద్‌కు పూనుకున్నట్టు వార్తలు వచ్చాయి.. కానీ, బంద్‌ కాలాఫ్‌ కావడంతో.. ఇప్పుడు యథావిధిగానే ఏపీలో మద్యం షాపులు పనిచేయనున్నాయి..

Show comments