NTV Telugu Site icon

AP Liquor Policy: ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రారంభం.. వారిలో ఉత్కంఠ..!

Ap

Ap

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ ద్వారా కేటాయిస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 17 వందల 97 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5 వేల 825 అప్లికేషన్స్‌ వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు. ఈ ప్రక్రియంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు.

Read Also: TGPSC Group-1 2024: అల‌ర్ట్‌.. నేటి నుంచి వెబ్‌సైట్‌ లో గ్రూప్‌-1 హాల్‌టికెట్లు..

మరోవైపు లిక్కర్‌ షాప్స్‌ లైసెన్సుల కోసం లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని.. దీని ద్వారా 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారుల అంచనా వేశారు. తిరుపతి, శ్రీసత్యసాయి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు వంటి జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడేసి దరఖాస్తులే వచ్చాయి. రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి దాదాపు 52 దరఖాస్తులు వచ్చాయి.

Show comments