Site icon NTV Telugu

APPSC: ఏపీపీఎస్సీలో కీలక సంస్కరణలు.. ఇక, వేగంగా నియామకాలు..

Appsc

Appsc

APPSC: ప్రత్యక్ష ఉద్యోగ నియామకల్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు అనుసరిస్తోన్న విధానంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది..అభ్యర్థుల సంఖ్య 25 వేలు మించినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది ఏపీపీఎస్సీ… ఉద్యోగాల ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే ఇకపై స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేగంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు కలగనుంది. ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసే అవకాశం నియామక సంస్థకు లభిస్తుంది. కొత్త విధానంతో నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది…

Read Also: Floods: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం.. వీడియో వైరల్

Exit mobile version