Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మరిన్ని అరెస్ట్‌లు..!

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లిక్కర్‌ కేసు హాట్‌టాపిక్‌గా సాగుతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌.. ఓవైపు కీలకంగా భావిస్తోన్న రాజ్‌ కేసిరెడ్డి విచారణపై దృష్టి పెడుతూనే.. మరోవైపు.. అరెస్ట్‌లపై ఫోకస్‌ పెట్టింది.. ఏపీ లిక్కర్‌ కేసు విచారణలో భాగంగా రాజ్‌ కేసిరెడ్డి కస్టడీ కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కేసు విచారణలో భాగంగా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సిట్‌..

Read Also: Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ

ఇక, ఏపీ లిక్కర్ స్కాం లో ఇవాళ కూడా అరెస్టులు జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు అధికారులు.. ఇప్పటికే కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ8 చాణక్యలను అరెస్టు చేసిన సిట్.. ఇవాళ మరొకరిని అరెస్టు చేస్తుందని ప్రచారం సాగుతోంది.. కేసులో ముడుపులు ఎక్కడ నుంచి ఎలా వెళ్లాయనే విషయాల విచారణ కోసం ఏ1 రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్‌ వేయగా.. నేడు కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే ఛాన్స్ ఉంది.. అయితే ఈ కేసులో సుమారు 3,200 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు.. అలాగే హవాలా రూపంలో షెల్‌ కంపెనీల ద్వారా భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని గుర్తుచేశారు..

Exit mobile version