Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

Ias Karthikeya Mishra

Ias Karthikeya Mishra

Andhra Pradesh: ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియామకమయ్యారు. కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా రిలీవయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కార్తికేయ మిశ్రా రిపోర్ట్ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ అధికారులను రిలీవ్ చేయాల్సిందిగా కోరుతూ కొద్ది రోజుల కిందట కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఐఏఎస్ పీయుష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హా రిలీవ్‌ అయ్యారు. తాజాగా కేంద్రం నుంచి కార్తికేయ మిశ్రా రిలీవ్‌ అయ్యారు. కేంద్ర ఆర్థిక సేవల విభాగం డైరెక్టరుగా పని చేసి కార్తికేయ మిశ్రా రిలీవయ్యారు.

Read Also: Minister Ramprasad Reddy: మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతాం..

Exit mobile version