Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena Party Membership: జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో గడువును మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు, అభిమానులు కూడా సభ్యత్వాన్ని పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఆన్లైన్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు.
Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.!
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఈ కార్యక్రమానికి గడువు తొలుత మార్చి 10తో ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సభ్యత్వ నమోదు గడువును పెంచాలని కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభ్యత్వ నమోదు గడువును మార్చి 17 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శాసన సభ్యులు కూడా మరికొన్ని రోజులు గడువు అవసరమని కోరినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు ప్రారంభమైన సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఎమ్మెల్యేలు వాటిలో నిమగ్నమయ్యారని, ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు గడువును పెంచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
17వ తేదీ వరకూ ఉద్యమి సభ్యత్వ నమోదు పొడిగింపు#JanasenaUdyami pic.twitter.com/21ivQD7pOd
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2026
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!