Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి.. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లు మీద సైజుతో సంబంధం లేకుండా రూ. 10 చొప్పున ధరలు పెరిగాయి.. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి ఉన్న పళంగా రూ.10 పెంచడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి కొందరు ధరలు పెరిగిన విషయం తెలియక నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు.. ఇంకా కొన్ని చోట్ల పాత ధరలు పట్టిక మార్చకపోవడంతో కన్ఫ్యూస్ అవుతున్నారు.. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మద్యం ధరలు 15 నుండి 20 రూపాయలు పెంచినట్లు ప్రచారం జరుగుతుంది.. అవన్నీ అవాస్తావమని పెరిగింది కేవలం రూ.10 ఏ అని చెప్తున్నారు నిర్వాహకులు..
Read Also: Rahul Gandhi: నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో భేటీ!
కాగా, గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సర్కార్ లిక్కర్ షాపులకు స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం.. మళ్లీ పాత పద్దతిలోనే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చ.. టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కట్టబెట్టిన విషయం విదితమే.. ఇక, ఇటీవల మద్యం అమ్మకాలపై దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన చేయడంతో కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి సర్కార్ సమీక్షించింది. అనంతరం, లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో, రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్-కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, ఈ కేబినెట్ సబ్- కమిటీ తన సిఫార్సులను కేబినెట్ కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా, మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం.. ఇవాళ్టి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రావడం జరిగిపోయాయి..