NTV Telugu Site icon

AP High Court: డీఎస్పీల ప్రమోషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ప్రమోషన్లపై ఇచ్చిన ఆదేశాలు రీ రివ్యూ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. 1995 బ్యాచ్‌ సీఐలకు ప్రమోషన్ ఇవ్వకుండా 1996 బ్యాచ్‌కి ప్రమోషన్లు ఇచ్చింది గత ప్రభుత్వం.. అయితే, గత ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు 1995 బ్యాచ్ అధికారులు.. నిబంధనలు, సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ప్రమోషన్‌లు ఇచ్చారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కొందరు 1995 బ్యాచ్‌కు చెందిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ప్రమోషన్లను రీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది..

Read Also: Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!