Site icon NTV Telugu

Rain Forecast in Andhra Pradesh: ఏపీలో మరోసారి భారీ వర్షాలు..!

Rain Effect

Rain Effect

Rain Forecast in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో మొంథా తుఫాన్‌ బీభత్సం సృష్టించింది.. ఏపీలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తూ.. ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, మొంథా తుఫాన్‌ నుంచి తేరుకోక ముందే.. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ పేర్కొంది.. ఏపీలో మరోసారి వర్షాలు ఉధృతం కానున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం పెరుగుతుంది. దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రైతుల్లో కలవరపాటు మొదలైంది. తీవ్ర తుఫాన్ కారణంగా జరిగిన పంటనష్టం కళ్ళ ముందే వుండగా మళ్ళీ వర్షాల హెచ్చరికలతో భయపడుతున్నారు.

Read Also: Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్‌..

ప్రస్తుతం వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోంథా తుఫాన్ తర్వాత తేమశాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. ఫలితంగా ఎండతీవ్రత పెరిగింది. అసలు వింటర్ సీజన్‌లో వున్నామా…?. అనే అనుమానం కలిగే స్ధాయిలో ఉక్కపోతలు ఎక్కువయ్యాయి. సాధారణం కంటే మూడు డిగ్రీలు అంత కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడేందుకు వాతావరణం సహకరిస్తోంది. మరోవైపు, ఉత్తర భారతంలో వెస్ట్రన్ డిస్రబెన్స్ వుంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి,అనకాపల్లి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు, మయన్మా ర్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుండగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే చాన్స్ కనిపించడం లేదు. ఈనెల 10 తర్వాత ఈ శాన్య రుతుపవన గాలులు మళ్ళీ యాక్టివేట్ అయ్యే సూచనలు వున్నాయి.

Exit mobile version