Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదలు పొంగి ప్రవహిస్తున్నాయి.. ఇక, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది..
Read Also: Fancy Numbers: ఫ్యాన్సీ నంబర్ల ప్రియులకు షాక్.. రెండురెట్లు ఫీజులు పెంపు!
ఈ రోజు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు.. మరోవైపు, పై నుంచి వస్తున్న వరదలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతుంది.. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,20,531 క్యూసెక్కులుగా ఉంది.. దీంతో, కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్..
