NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణ.. గవర్నర్ ఆమోదం

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు.. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది.. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో ఈ నెల 13వ తేదీన ప్రవేశపెట్టారు. ఇక, ఆ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనసభ… నవంబర్‌1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొంది ప్రభుత్వం.. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.. తాజాగా, ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌.

Read Also: Maharashtra CM Post: సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ హైరానా! కారణమిదేనా?

Show comments