Site icon NTV Telugu

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం.. 500 మంది ఇంటికే..!

Ap Fibernet

Ap Fibernet

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌‌‌ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది.. సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్‌ అవ్వనున్నారు.. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఉద్యోగులంతా కూడా ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా జీతాలు తీసుకున్న పరిస్థితి ఉంది.. దీనిపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం దాదాపు 500 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగించింది.

Read Also: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు

కాగా, గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌ నెట్‌లో భారీగా అవకతవకలు జరిగినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఒకవైపు అయితే.. మరోవైపు.. కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయినట్టు తేల్చింది.. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాత ఉద్యోగులే ఉండడంతో.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా అమలు కావడంలేదని విమర్శలు వచ్చాయి.. దీనిపై ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది సర్కార్‌.. దీంతో, చర్యలకు పూనుకుంది.. అందులో భాగంగా ఏపీ ఫైబర్‌ నెట్‌ నుంచి దాదాపు 500 మంది ఉద్యోగాలను తొలగించింది.

Exit mobile version