NTV Telugu Site icon

Free Gas Cylinders Scheme: మరో ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్..

Ap Cm

Ap Cm

Free Gas Cylinders Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఫోకస్‌ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు.. అయితే, ఈ రోజు ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో మరో ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ స్కీం ప్రారంభిస్తామని వెల్లడించారు.. దీపావళికి వీలైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. అభివృద్ధి పనులను స్ట్రీమ్ లైన్ చేస్తాం అన్నారు.. ఇక, వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 350 కోట్లు వచ్చాయి. వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని పిలుపునిచ్చారు.. బుడమేరు కబ్జాలకు గురైంది. కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. వరదలో బాధితుల కష్టాలు వర్ణనాతీతం. వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇవ్వాలనుకున్నాం. రికార్డు స్థాయిలో వరద బాధితులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. కౌలు రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు.

Read Also: Jani Master: జానీ మాస్టర్‌ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్‌

కోట్లాది మంది కూటమిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ప్రజలు ఇంతటి నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులు చేయొద్దు.. కక్ష సాధింపులకు దిగొద్దు. కక్ష సాధింపు చేయాలంటే ముందుగా నేనే చేయాలి.. కానీ, అది మన విధానం కాదని స్పష్టం చేశారు.. ఎన్నికల ముందు మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం అద్భుతం. ఈ వంద రోజుల్లో కూడా అదే సమన్వయంతో పని చేశారని ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, నరేగా నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు. పవన్ కల్యాణ్‌ దగ్గరే ఎక్కువగా నిధులు ఉన్నాయన్న సీఎం.. ధాన్యం కొనుగోళ్లు చేస్తే.. 48 గంటల్లో డబ్బులు ఇస్తాం. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే.. ఆనాటి ముఖ్యమంత్రి ఆ పక్కకే పోలేదు. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే.. దాన్ని పెట్టడానికి రెండు సీజన్లు సమయం పట్టింది. తుంగభద్రలో గేట్లు పోతే మన సహకారంతో కన్నయ్యనాయుడు నేతృత్వంలో గేట్లను బిగించగలిగాం అన్నారు..

Read Also: Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కోరికే తప్ప.. వ్యూహాలు లేవు..!

విశాఖ స్టీల్ ప్లాంటును ఇష్యూ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది.. గత ఐదేళ్లల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నోరు మెదపలేదని మండిపడ్డారు చంద్రబాబు.. ప్రైవేటుకు అప్పజెప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన.. ప్రాజెక్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత. నీరు-చెట్టు.. నరేగా పెండింగ్ బిల్లులు కూడా రిలీజ్ చేస్తున్నాం. రాజధాని రైతులకు కౌలు ఇస్తున్నాం. రాజధాని రైతులను పెట్టని ఇబ్బందుల్లేవ్. ముంబై నటిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానమేంటో చూశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులను వదిలి పెట్టం. మత్స్యకారులను.. చేనేత కార్మికులను ఆదుకుంటాం. దేవాలయాల్లో నాయీ బ్రహ్మాణులకు జీతాలు పెంచాం. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. అర్చకుల వేతనాలను పెంచాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఇప్పుడు నిర్మాణం మొదలు పెట్టిన ఇళ్లను పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికీ ఇంటి జాగా లేదనకుండా చర్యలు తీసుకుంటాం. పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్ర ప్రింట్ చేసి ఇస్తాం. అన్ని డిపార్టమెంట్లను ప్రక్షాళన చేస్తున్నాం. 2047 మిషనులో 15 శాతం గ్రోత్ రేట్ పెట్టుకుంటున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..