Site icon NTV Telugu

Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్‌ సమక్షంలో చేరిక

Sailajanath

Sailajanath

Sailajanath to join YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లు తగులుతూ వచ్చాయి.. పార్టీలో కీలకంగా ఉన్నవాళ్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది వైసీపీకి గుడ్‌బై చెప్పి కూటమి పార్టీల్లో చేరారు.. అయితే, ఇప్పుడు కీలక నేత, మాజీ మంత్రి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. అయితే, గత కొంతకాలంగా.. శైలజానాథ్‌ చూపు వైసీపీ వైపు అనే ప్రచారం సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగానే ఇటీవలే పలుసార్లు వైఎస్‌ జగన్ తో భేటీ అయ్యారు శైలజానాథ్.. ఇక, ఆయన వైసీపీలో చేరేందుకు వైఎస్‌ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రేపు పార్టీలో చేరబోతున్నారు శైలజానాథ్.. ఈ కార్యక్రమం తర్వాత బెంగళూరు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్..

Read Also: Ram Gopal Varma: రేపు పోలీసు విచారణకు రాంగోపాల్‌ వర్మ.. వస్తాడా..?

అయితే, కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా పనిచేసిన శైలజానాథ్.. వైఎస్‌ హయంతో మంత్రిగా కూడా పనిచేశారు.. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ పొలిటిక్స్ లో లేకుండా పోయారు.. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు.. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడుగా శైలజానాథ్‌కు మంచి గుర్తింపు ఉంది. శైలజానాధ్ గతంలో శింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.. ఇక, కష్టసమయంలో వైసీపీ గూటికి చేరుతున్న శైలజానాథ్‌కి జగన్‌ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి మరి..

Exit mobile version