NTV Telugu Site icon

Floods Damage in AP: అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం.. ప్రాథమిక అంచనాలు దాటేస్తోంది..

Floods Damage

Floods Damage

Floods Damage in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. ముఖ్యంగా విజయవాడను అతలాకుతలం చేశాయి.. అయితే, ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్‌ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్‌ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులకు అంచనాలు ఉన్నాయట..

Read Also: Budameru Floods: కొల్లేరుకు భారీగా బుడమేరు వరద.. 9 గ్రామాలకు రాకపోకలు బంద్..

రాష్ట్రంలో జరిగిన వరద నష్టం విషయానికి వస్తే.. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు, 200 ఎకరాల్లో సెరీకల్చర్ కు నష్టం జరిగిందట.. ఏపీలో మొత్తంగా 5921 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. 4203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతింటే.. పంచాయతీల పరిధిలో 1160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్డులు డ్యామేజ్‌ అయ్యాయట.. ఇక, 540 పశువులు మృత్యువాత పడగా.. కిలో మీటర్ల మేర 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు దెబ్బతిన్నాయి.. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడిపోయాయి.. వరదలకు 1283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి.. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడి అపార నష్టాన్ని మిగిల్చాయి.. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు.. చెరువులకు గండ్లు పడినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇలా అంతా లెక్కిస్తూ పోతుంటే.. వరద నష్టం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.