PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పథకాలకు సంబంధించి రాష్ట్రస్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఈ రోజు జరిగింది.. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ విజయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు సీఎస్.. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.. ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు..
Read Also: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు సీఎస్ విజయానంద్.. ఈ పథకాన్నిజాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (NPIA) మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (SIAలు) అమలు చేస్తాయి.. కావున, ఈ పథకం కింద డిస్కమ్‌లు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. పెద్దఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు..
Read Also: Manipur: బీజేపీకి షాక్ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు గ్రామం, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలు ఈ పథకానికి ఒక మోడల్. ఈ మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నూరు శాతం సోలరైజేషన్ కు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా ఫైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని సూచించారు ఏపీ సీఎస్.. 2 కిలో వాట్ సామర్థ్యం గల సిస్టమ్‌లకు సోలార్ యూనిట్ ధరలో 60 శాతం సబ్సిడీ ఉంటుందని.. 2 నుండి 3 కిలో వాట్ సామర్థ్యం మధ్య సిస్టమ్‌లకు అదనపు సిస్టమ్ ఖర్చులో 40 శాతం సబ్సిడీని, 3 కిలో వాట్ వరకూ రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. దరఖాస్తుదారు సోలార్ ప్యానెళ్లను అమర్చుకోడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి.. ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలన్నారు.. గృహాలతోపాటు వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలపై కూడా వీటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రభుత్వ భవనాలపైన సోలార్ రూప్ టాప్ లు ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లుల పొదుపు చేసేందుకు అవకాశం ఉందని.. సంబంధిత శాఖల సమన్వయంతో తగిన కార్యాచరణ ప్రణాళికలను ట్రాన్స్ కో అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు ఏపీ సీఎస్ విజయానంద్..