Site icon NTV Telugu

Weather Update: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. నాలుగు రోజులు వర్షాలే వర్షాలు..!

Heavy Rains

Heavy Rains

Weather Update: నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం.. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంది.. ఆ తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుండి 29వ తేదీ వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూంచింది.. ఇక, నవంబర్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు..

Read Also: Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్

Exit mobile version