NTV Telugu Site icon

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు పొడిగింపు

Ev

Ev

Andhra Pradesh: పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు గుడ్‌బై చెప్పి.. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సంఖ్య పెరుగుతోంది. ఇక, ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలుచర్యలు తీసుకుంటున్నాయి.. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2024 డిసెంబర్ 7 తేదీ వరకూ రాష్ట్రంలో ఈవీలపై పన్ను మినహాయిస్తూ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. 2018-23తో ముగిసిన ఈవీ విధానం స్థానంలో.. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఈవీలకు పన్ను మినహాయింపు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, గతంలో పోలిస్తే.. ఇప్పుడు ఈవీలకు మారేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఈవీ బైక్‌లతో పాటు.. కార్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది.. ఖర్చు కూడా భారీగా కలిసివస్తుండడంతో.. వినియోగదారులు ఈవీలవైపు మొగ్గుచూపుతోన్న విషయం విదితమే.

Read Also: UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..

Show comments