Site icon NTV Telugu

CM Chandrababu: ఎవరికి కేటాయించిన పదవిలో వారే పని చేసుకోండి.. లేదంటే..? చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్‌షాప్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరికిచ్చిన పదవిలో వారే బాధ్యతగా పని చేయాలని, కావాలని వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత అజెండాలు, అనవసర వివాదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలి. కావాలని సమస్యలు సృష్టిస్తే పక్కన పెడతాం అని తేల్చి చెప్పారు.

Read Also: Aadhaar Mobile Number: ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా.. ఆన్‌లైన్‌లో ఆధార్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు..

పదవులు తీసుకున్న ప్రతి నాయకుడి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు చంద్రాబు… ప్రజల కోసం పని చేస్తున్నారా? పార్టీ లక్ష్యాలను అమలు చేస్తున్నారా? అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన ఉంటుందని చెప్పారు. పనితీరు సరిగా లేకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా పక్కకు తప్పిస్తామని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడమే పార్టీ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి.

 

Exit mobile version