CM Chandrababu: ఎవరికి కేటాయించిన పదవిలో వారే పని చేసుకోండి.. లేదంటే..? చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
- టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్ షాప్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- ఎవరికి కేటాయించిన పదవిలో వారే పని చేసుకోవాలి..
- కావాలని వివాదాలు సృస్టిస్తే పక్కన పెడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్‌షాప్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరికిచ్చిన పదవిలో వారే బాధ్యతగా పని చేయాలని, కావాలని వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత అజెండాలు, అనవసర వివాదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలి. కావాలని సమస్యలు సృష్టిస్తే పక్కన పెడతాం అని తేల్చి చెప్పారు.
Read Also: Aadhaar Mobile Number: ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా.. ఆన్లైన్లో ఆధార్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు..
Also Read
- TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
పదవులు తీసుకున్న ప్రతి నాయకుడి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు చంద్రాబు… ప్రజల కోసం పని చేస్తున్నారా? పార్టీ లక్ష్యాలను అమలు చేస్తున్నారా? అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన ఉంటుందని చెప్పారు. పనితీరు సరిగా లేకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా పక్కకు తప్పిస్తామని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడమే పార్టీ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి.
తాజావార్తలు
-
Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
-
TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
-
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
-
Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!