NTV Telugu Site icon

Karthika Masam First Monday: హరహర మహాదేవ.. శైవక్షేత్రాల్లో కార్తీక తొలి సోమవారం రద్దీ

Karthika Masam First Monday

Karthika Masam First Monday

Karthika Masam First Monday: కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా చెబుతారు.. ఈ మాసంలో ప్రతీ శైవక్షేత్రంతో పాటు.. ప్రతీ శివాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ.. కార్తీక దీపాలను వెలిగిస్తూ.. తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు.. ఇక, కార్తీక మాసంలో వచ్చే తొలిసోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉందనే చెప్పాలి.. శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం క్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనతో.. భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.. ముందస్తుగా ఆలయంలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసింది..

కార్తీక సోమవారం పర్వదినం రోజున. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం 12వ వార్డు అడ్డగల వారి వీధిలో కొలువైన శ్రీ ఏకాంబస్వర స్వామి ఆలయం వద్ద ఆశ్చర్య కరమైన సంఘటన చోటు చేసుకుంది.. ఆలయ పూజారి పరమశివునికి అభిషేకం చేసి అలంకరణ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా ఓ ఆంబోతు వచ్చి ఆలయం వద్ద నిలబడింది అలంకరణ పూర్తయినా ఆ ఆంబోతు అక్కడ నుంచి కదలలేదు. చివరికి వేద పండితులు బయటికి వచ్చి ప్రసాదం పెట్టగా తిని వెళ్ళింది. ఈ సంఘటన చూసిన భక్తులు, స్థానికులు సంబర మాశ్చర్యాలకు గురయ్యారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని త్రికోటేశ్వరునికి ప్రత్యక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివయ్యను దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండే పెద్దఎత్తున భక్తులు, అయ్యప్పస్వాములు, శివ స్వాములు తరలివచ్చారు. భక్తులు ముందుగా ఆలయప్రాంగణంలో దీపారాధన చేసి కోటయ్యను దర్శించుకున్నారు…

ఇక, నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. కార్తీకమాసం సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తులసి చెట్టు వద్ద పూజలు నిర్వహించి గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయ క్షేత్రంలో కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు, స్వామి అమ్మవారిని దర్శించుకుని విశేష, అభిషేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు, ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, రానున్న ఐదేళ్ల కాలంలో యాగంటి క్షేత్రానికి మరింత అభివృద్ధి పరిచేందుకు సంపూర్ణ సహకారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు.

మరోవైపు.. యాగంటి క్షేత్రం లో వెలిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.. స్వామి వారి గర్భాలయంలో విశేష పూజలతో పాటు ప్రత్యేకంగా పంచామృత, అభిషేకాలను ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నేటి నుండి ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలు డిసెంబర్ 2 వరకు నిర్వహించ నున్నారు, కార్తీక మాసం ప్రారంభమైన మొదటి సోమవారం ఆలయ క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు, శివ స్వాములు తరలి వచ్చి పెద్ద కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన శిఖర గోపురం ఎదుట నున్న ధ్వజ స్థంభం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం గర్భాలయంలో ఏకశిలపై కొలువై ఉన్న స్వామి అమ్మవార్లను ను దర్శించుకుని మొక్కుల చెల్లించుకున్నారు.. యాగంటి క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి మంచి నీటి సరఫరాతో పాటు అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు, భక్తులకు అవసరమైన మేరకు లడ్డు, ప్రసాదాలను సిద్ధం చేసి ఉంచారు. కార్తీక మాసం సందర్భం గా పలు జిల్లాల భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు తరలి రానుండటంతో భక్తుల సౌకర్యార్థం బనగానపల్లె ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు భక్తులు దేవస్థాన ప్రాంగణంలో కార్తీకదీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలధారణ చేశారు. అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం లో భక్తుల శరణం అయ్యప్ప నామస్మరణంతో మారుమోగిపోయింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రీశ్వరుని ఆలయం కు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో నేడు మొదటి సోమవారం కావటంతో తెల్లవారుజాము నుండి భక్తులు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొనేరులో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకొని మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకొని నోములు నోచుకున్నారు.. ప్రఖ్యాత గాంచిన నీలాద్రీశ్వరుని ఆలయంలో మొక్కులు మొక్కటంతో నెరవెరుతాయి అనే నమ్మకంతో భక్తులు తెల్లవారుజామున నుండే నోములు నోచుకొని కార్తీక దీపాలు వెలిగించి ఉపావాసాలు ఉంటూ భక్తి ని చాటుతున్నారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావటంతో నీలాద్రీ శైవక్షేత్రం భక్తులతో కిక్కిరిసి శివనామస్మరాణంతో మారు మొగింది. కార్తీకమాసంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మహానంది క్షేత్రంలో కార్తీకమాస సందడి మొదలైంది. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. రుద్రగుండం కోనేరులో భక్తులు పవిత్ర స్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారికి మహా రుద్రాభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు వేద పండితులు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, ప్రకాశం జిల్లా పొదిలి శివాలయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది.. ప్రత్యేకంగా.. ప్రత్యేక్షంగా తాను ఒంటరిగా భక్తి శ్రద్దలతో విశేష కార్తీక పూజలు చేసింది ఓ చిన్నారి భక్తురాలు.. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పొదిలి శ్రీ పార్వతీ దేవి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేసింది చిన్నారి భక్తురాలు పట్టుమని పది ఏళ్ళు కూడా నిండని చిన్నారి భక్తురాలు భక్తిశ్రద్ధలతో కార్తీకమాసం సందర్భంగా కార్తీకదీపలతో పూజలు చేయడం చిన్నారి చేస్తున్న పూజలకు ఫిదా అయ్యారు భక్తులు…. ఆ చిన్నారి చిన్న వయసులో తెల్లవారుజామున దేవస్థానంకు వచ్చి కార్తీకపూజలు చేసి ప్రతిఒక్కరి భక్తులను భక్తి పార్వశంతో మైమరపించిన ఆ చిన్నారి భక్తురాలకు తాంబూలం అందజేసి ఆశీర్వదించారు భక్తులు.. ప్రతి ఒక్కరు ఈ చిన్నారి భక్తురాలిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆధ్యాత్మికతను సంతరించుకోవాలని పలువురు భక్తులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రాచీన స్వయంభు ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం కార్తీక శోభ సంతరించుకుంది మొదటి సోమవారం కావడంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ స్వామి దర్శనానికి వేకువ జామ నుండే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. 55 అడుగుల ఎత్తులో ఉండే స్వయంభు ఎండలు మల్లికార్జున స్వామి దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు . ఈ సందర్భంగా ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. శివుని అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో తొలి సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కాశీబుగ్గ లోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల తో శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. పలాసలోని ఎండల మల్లికార్జున దేవాలయం, చంద్రశేఖర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయం, కాశీబుగ్గ లోని ఉమా రుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీకన్యకా పరమేశ్వర , నీలకంఠేశ్వరుని ఆలయాల దగ్గర క్యూ లైన్ల లో భక్తులు బారులు తీరారు.

కార్తీక మాసం సందర్భంగా ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో శోభయామానంగా అలంకరించారు . పలాస పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివుని నిజరూప దర్శనాన్ని తిలకించి పులకించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న దక్షిణకాశీగా పిలవబడే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనం భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు . తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో అతి పురాతనమైనది .త్రేతాయుగములో శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివుని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. సీతను రావణాసురుడు ఆహ్వానించడంతో సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు దండకారణ్యం లో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు లో ఉన్న తాటకీ అనే రాక్షసిని సంహరించడం వల్ల ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. తాటిపత్రి కాలక్రమేణా తాడిపత్రి గా మారింది. ప్రతి ఏడాది కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.స్వామి ఆలయం ఉత్తరం వైపున పెన్నా నది ప్రవహిస్తుంది .ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆలయం ఉన్నాయి. తాడిపత్రి లో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం నుండి సర్వ కాలాల్లో నీరు ఉద్భవిస్తుంది .అందుకే ఇక్కడ ఉన్న శివునికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామీ ఆలయం అనే పేరు ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో నాలుగు సోమవారాలు రావడం వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

బాపట్ల జిల్లా చీరాలలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్బంగా పలు శివాలయాలు భక్తులు తోకిటకిటలాడాయి.తెల్లావారుజామునుంచే శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఆలయాలలో మహీళ భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. హారతి ని అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. పంచామృతాలతో ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.ఆ పరమ శివుని ఆశీస్సులతో తమ కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని భక్తులు ప్రగాఢ నమ్మకంతో పూజలు నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం.. దక్షిణ కాశీగా పేరుగాంచి, పంచారామాల్లో ఒకటైన రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో వేంచేసియున్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం చెంతని ఉన్న సప్త గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. మాణిక్యాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఏ విధమైన అసంకార్యాలు కలగకుండా ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గాభవాని అన్ని ఏర్పాట్లు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి తీరం శివనామ స్మరణంతో మారుమోగిపోతుంది . తొలి కార్తిక సోమవారం కావడంతో వశిష్ట గోదావరిలో పుణ్య స్నానం చేసేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూకట్టారు. పట్టణంలోని వలందర్ , అమరేశ్వర రేవుల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు చేసి కార్తీకదీపాలు విడిచి పెట్టారు. కార్తీక మాసంలో వశిష్ట గోదావరి పుణ్య నదిలో స్నానమాచరించి నదిలో దీపాలు విడిచిపెడితే సకల పాపాలు నశించి , పుణ్యఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.. తొలి సోమవారం కావడంతో పట్టణంలోని అమరేశ్వర, కపిల మల్లేశ్వర , మండలంలోని లక్ష్మనేశ్వరం స్వామివారి ఆలయాల్లో పరమశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు.. భక్తులు పరమశివునికి అభిషేకాలు చేయించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. శివనామస్మరణతో మారుమోగిన శివాలయం… హర హర శంభో అంటున్నా భక్తులు… కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పొదిలి పార్వతి దేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో శివనామస్మరణతో పోటెత్తిన దేవస్థానానికి భక్తులు.. భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్న చిన్నారులు, భక్తులు.. తెల్లవారుజాము నుండి స్వామివారి అభిషేకాలు మరియు పూజలు దర్శనం కోసం దేవస్థానం బయట వరకు బారులు తీరిన భక్తులు.. ఇక్కడ ఒకే ప్రాంగణంలో నాలుగు శివాలయాలు ఉండటంతో భక్తులతో దేవస్థానం కనువిందు చోటు చేసుకుంటుంది ప్రత్యేకంగా ఈ శివాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు.. ఇది దేవస్థానం వెంకటగిరి రాజుల కాలంలో నిర్మించడంతో అప్పటినుంచి ఇప్పటివరకు స్వయంభుగా కలిసిన శ్రీ నిర్మామహేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లి ఉన్నవాళ్లు కార్తీకమాసం మరియు శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేకంగా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. పొదిలి నిర్మామహేశ్వర స్వామి దేవస్థానానికి కార్తీకమాసంలో ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యల స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు, ముక్కులలో పాల్గొంటారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టామని తెలిపిన దేవాదాయశాఖ అధికారి లీలా కృష్ణ.

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాదిగా తరలివచ్చి భక్తులు గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. భక్తులు స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లను మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు.