Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి.. పర్యావరణ పరిరక్షణకు సహకారం..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ప్లాస్టిక్‌ వినియోగంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం పై వివరించారు.. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం.. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నారు.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం.. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ప్రజలకి సంపూర్ణ అవగాహన కల్పించాలి అని పిలుపునిచ్చారు..

Read Also: Senior Heroes : ఆ నలుగురు టాలీవుడ్ సీనియర్ హీరోల లైనప్ మాములుగా లేదుగా

ఇక ప్లెక్సీ లు అరికట్టాలి… కానీ, ఇవి మంచిది కాదు.. ప్లాస్టిక్ వల్ల లైఫ్ స్పాన్ పై ప్రభావం పడుతోంది. ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలవడం లేదు అన్నారు పవన్‌ కల్యాణ్.. తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు అధ్యయనంలో తేలిందన్న ఆయన.. ప్లాస్టిక్ ఫ్రీ కాన్సెప్ట్ తిరుమలలో అమలు చేస్తున్నాం.. లక్షలాది మంది భక్తులు క్రమశిక్షణతో ఉన్నారు. ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణ పరిరక్షణకు సహకారం అందిస్తున్నాం అన్నారు.. ప్లెక్సీ లు డేంజర్ గా ఉన్నాయి.. పొలిటికల్ ఫంక్షన్ సినిమా కార్యక్రమాలకు ప్లెక్సీ లు నిషేధించాలని సూచించారు.. ప్లెక్సీ లు నిషేధిస్తే కొంతమంది ఉపాధి కోల్పోతారు.. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.. పంచాయితీ రాజ్ లో ఉన్న ఉద్యోగులు… ప్రజాప్రతినిధులు కలిసి మొటివేషన్ ప్రోగ్రాం చేస్తాం అని వివరించిన పవన్‌ కల్యాణ్.. ప్లాస్టిక్‌ నిషేధం.. ప్లాస్టిక్‌ యూత్‌ వచ్చే పరిణామాలపై ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version