Deputy CM Pawan Kalyan: ఒక ఉద్ధానంలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలన్నారు.. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఉన్నారు.. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలి.. ఈ లోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలని స్పష్టం చేశారు.. అయితే, అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయి అంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇంకా పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల మంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసన సభలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి…
Deputy CM Pawan Kalyan: ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు..
- ఉద్ధానంలోనే కాదు.. ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారు..
- జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలన్న పవన్ కల్యాణ్..
- కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారని ఆవేదన..