NTV Telugu Site icon

Chandrababu and Pawan Kalyan: కేబినెట్‌ ముగిసిన తర్వాత సీఎం-డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ

Pawan And Babu

Pawan And Babu

Chandrababu and Pawan Kalyan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.. అయితే, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్‌ కి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.. మరోవైపు ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న ఆయన.. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రధానిని ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: IPL 2025 JioHotstar: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. అలాచేస్తే ఉచితంగా జియోహాట్‌స్టార్

కాగా, ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్‌, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లును అఫ్రూవ్‌ చేసింది.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింప జేయనున్నారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు… E1 జంక్షన్ నుండి సీఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400KV DC లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. మరోవైపు.. బుడమేరు డివిజన్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్‌ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..