NTV Telugu Site icon

Deputy CM and CM Meeting: సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. 2 గంటల పాటు కీలక చర్చలు

Babu Pawan

Babu Pawan

Deputy CM and CM Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్.. ఆయనతో సుదీర్ఘంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం సీజ్‌ వ్యవహారం.. బియ్యం అక్రమ రవాణా సహా తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనతో పాటు కాకినాడ పర్యటనపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది.. సోషల్‌ మీడియా కేసుల వ్యవహారంతో పాటు నామినేటెడ్‌ పోస్టుల అంశంపై కూడా ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ సమాలోచనలు జరిగినట్టుగా చెబుతున్నారు.. ఇక, రేపటి కేబినెట్ సమావేశం సహా పలు ప్రధాన అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు..

Read Also: Maharashtra CM Post: కోలుకోని షిండే.. ఎన్డీఏ సమావేశం రద్దు! అసలేం జరుగుతోంది

కాగా, ఈ మధ్యే ఢిల్లీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ఇక, ఆ తర్వాత.. కాకినాడలో పట్టుబడి రేషన్‌ బియ్యాన్ని ఆయన గ్రౌండ్‌లెవల్‌లోకి వెళ్లి పరిశీలించడం.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న నన్నే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని వ్యాఖ్యానించడం సంచలనంగా మారిన విషయం విదితమే.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్య జరిగిన సమావేశంలో.. ఈ అన్నింటినిపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది..