NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్‌

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర వెలకట్టలేనిది. మానవ తప్పిదాలు మడ అడవుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. వీటి పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మడ అడవులను విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.. మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులను నియమించి, రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం అరణ్య భవన్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. మడ అడవుల రక్షణ, విస్తీర్ణం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

Read Also: Minister Narayana: కొత్త మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష.. కీలక ఆదేశాలు..

ఇక, పర్యావరణ పరిరక్షణపై నాకు ఉన్న ప్రత్యేకమైన ఆసక్తే అటవీశాఖ ఎంచుకోవడానికి కారణంగా పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌. పర్యావరణానికి ఎవరు హాని కలిగించినా దానిపై పోరాటం చేస్తూ ఉండేవాడిని. మడ అడవులు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. ప్రకృతి సౌందర్యంతో పాటు ఎన్నో రకాలు వన్యప్రాణులకు ఆవాసాలుగా ఉంటున్నాయి. మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి రక్షణ కవచంగా ఉన్నాయి. మడ అడవులు ఒక కుటుంబంలా కలిసి పెరుగుతాయి. మడ అడవులు ప్రకృతి ప్రసాదిత వరాలు. తుఫానులు, సునామీల నుంచి తీర ప్రాంతాలను కాపాడడం, వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కల్పించడం వంటి అంశాల్లో మడ అడవుల పాత్ర కీలకం. మడ అడవులు జాతుల పరస్పర కదలికల్ని సులభతరం చేస్తాయి. అయితే సగటు మనిషికి మడ అడవుల ఆవశ్యకతపై అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మడ అడవులు అవసరం. ఈ అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

Read Also: AP Government: మైనార్టీ విద్యార్థులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ..

మడ అడవుల నరికివేత, మడ ప్రాంతంలోకి వచ్చి ఆక్వా కల్చర్ చేయడం, పట్టణీకరణ వంటి అంశాలతో మడ అడవులకి ముప్పు పొంచి ఉంది.. విధ్వంసానికి పాల్పడితే వాటి పునరుద్ధరణకు శతాబ్దకాలం పడుతుందన్నారు పవన్‌.. అభివృద్ధి, అక్వా సాగు కావాలంటే మరోచోట చేసుకోవచ్చు. పారిశ్రామిక వ్యర్ధాలు, ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాలు కూడా మడ అడవులకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు మడ అడవుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరించారు.. గతంలో కోరింగ మడ అడవుల వ్యవహారం నా దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న మడ అడవులు తొలగించి గృహ నిర్మాణానికి ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేస్తాం అన్నారు. ప్రభుత్వ భూముల్లో మడ అడవులు ఉంటే వాటని అటవీ భూములుగా గుర్తించే విధంగా చర్యలు చేపడదాo. అటు ప్రసార మాద్యమాల ద్వారాను మడ అడవుల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు డిప్యూటీ సీఎం..

Read Also: Nellore: ప్రభుత్వ పాఠశాలలో కూలిన స్లాబ్.. విద్యార్థి మృతి

ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 405 చ.కి.మీ. మేర మడ అడవులు ఉన్నాయి. ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో మరో 100 చ.కి.మీ. మేర మడ విస్తరించిందన్నారు పవన్‌.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మంగ్రూవ్ ఇనీషియేటివ్ ఫర్ షోర్ లైన్ హబీటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ (మిస్టీ)’ ద్వారా రాబోయే అయిదేళ్లలో 700 హెక్టార్లలో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగాపెట్టుకున్నాం. 50శాతం కేంద్రం నిధులు ఇస్తుంది. 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాము. మడ అడవుల పరిరక్షణ, అభివృద్ధి, అక్కడి ప్రజల జీవనోపాధుల మెరుగు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకొంటున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.