NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. అందుకే కొన్ని సమావేశాలు హాజరుకాలేదు..!

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది.. అయితే, ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొన్ని సమావేశాలకు దూరంగా ఉండడంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.. అయితే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి.. ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్‌ కల్యాణ్.. మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు పవన్‌.. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయానన్న ఆయన.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీని వైఎస్‌ జగన్ అప్పుల కుప్పగా మార్చారు.. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.. పర్యావరణ, అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు.. నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్

కాగా, ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం వేదికపై ఎన్డీఏ నేతలను అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన ప్రధాని మోడీ.. ఏపీ డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా పలకరించారు.. ఇద్దరి మధ్య సరదా సంభాషణ సాగినట్టు ఆ దృశ్యాలను చూస్తుంటే స్పష్టమవుతుండగా.. ఆ ర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా? అంటూ ప్రధాని మోడీ ప్రశ్నించారని.. వేదిక పైకి వచ్చే సమయంలో ఎన్డీఏ నేతలందరినీ పలకరించిన మోడీ.. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న పవన్ ను చూసి కొద్దిసేపు ముచ్చటించారు.. మోడీ ఏం మాట్లాడారని మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా.. వివరాలు వెల్లడించిన ఆయన.. ప్రధాని నాపై చాలా సార్లు జోకులు వేస్తుంటారు.. ఈ రోజు నా వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నావా? అని ప్రధాని అన్నారు.. అలాంటిదేమీ లేదని నేను చెప్పాను.. చేయాల్సింది చాలా ఉంది అని ప్రధాని మోడీకి చెప్పానంటూ వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..